మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజు మౌనీ వ్రతం ఆచరించి నదీతీరంలో గానీ, సముద్రస్నానం గానీ చేస్తే పుణ్యమని పెద్దలు చెబుతారు.
దానితో పాటు అస్సలు నోరు పెగల్చవద్దని పరమనిష్ఠతో మౌనంగా ఉండమనటంలో ప్రధమ ఉద్దేశ్యం మాట్లాడటానికి సహకరించే అనేక నరాలూ, నాలుకా, నోరూ, దంతాలకీ ఆ రోజు సంపూర్ణంగా శెలవివ్వటమే, సంవత్సరంలో ఒక్కసారన్నా ఉపవాసము వుండి
కడుపుకీ, మౌనీ అమావాస్య నాడు మౌనం దాల్చి నోటికీ ఒకింత విశ్రాంతి నివ్వాలనే పెద్దలు భక్తినీ, ఆరోగ్యాన్ని కలిపి ఆచారంగా పెట్టారు. విశ్రాంతి ఎప్పటటికప్పుడు మనం తీసుకుంటాము. పెద్దలు శరీరంలో పనిచేసే అవయావాలకి ఆచారాలూ, సాంప్రదాయం పేరుతో విశ్రాంతినిచ్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: